05-12-2016 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్‌దాదా” మధువనము
‘‘మధురమైన పిల్లలూ - సత్యమైన తండ్రితో సదా సత్యంగా ఉండండి, సత్యం తెలపకపోతే పాపం వృద్ధి చెందుతూ ఉంటుంది.’’
ప్రశ్న:-రుద్ర యజ్ఞమును రక్షించు సత్యమైన బ్రాహ్మణుల ధారణలు మరియు గుర్తులు చెప్పండి?
జవాబు:-యజ్ఞ రక్షక బ్రాహ్మణులు ఎప్పుడు కూడా విరుద్ధ కర్మలు చేయలేరు. వారు దేహీ-అభిమానులై మొదట స్వయాన్ని సంభాళించుకుంటారు. వారి లోపల రావణుని ఎటువంటి అంశం కూడా అనగా భూతము ఉండదు. చాలా-చాలా మధురంగా ఉంటారు. తండ్రితో సదా సత్యంగా ఉంటారు. ఎవరైనా ఆసురీ మనుష్యులు ఒకవేళ పొరపాటు చేసినా కూడా వారి పై స్వయంగా కోపగించరు. ప్రతి కర్మతో తండ్రిని షో (ప్రత్యక్షం / Show) చేస్తారు.గీతము:-ఎవరైతే ప్రియుని జతలో ఉన్నారో,........ (జో పియా కే సాథ్ హై.......)ఓంశాంతి.ఎవరైతే ప్రియుని జతలో ఉన్నారో - సోదరులు, సోదరీలు, వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఇతర ఏ సెంటరులోనూ ఇలా ఉండరు. ఈ నియమము ఇక్కడ మాత్రమే ఉంది. బాప్‌దాదా వచ్చే వరకు తండ్రితో బుద్ధియోగము జోడించేందుకు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ యోగంలో కూర్చుంటారు. స్వయంగా స్మృతిలో కూర్చుంటారు, మేము కూడా స్మృతిలో కూర్చున్నాము, మీరు కూడా శివబాబా స్మృతిలో కూర్చోండి అని ఇతరులను కూడా సైగలతో యోగంలో కూర్చోబెడ్తారు. శివబాబాను గుర్తు చేసుకోవడంతో మా వికర్మలు భస్మమవుతాయని పిల్లలకు తెలుసు. ఇక్కడ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఎవరైతే ముందు కూర్చొని ఉంటారో, వారు కూడా ఆ సమయంలో స్మృతిలో ఉండాల్సిందే. తండ్రి స్మృతిలో కూర్చోమని స్టూడెంటుకు చెప్పి టీచరు బుద్ధి ఇటు-అటు సంబంధీకుల వైపుకు పరిగెడుతూ ఉండరాదు, ఇది శోభించదు. టీచరు పై దోషం పడరాదు కనుక మొదట స్వయం ఇటువంటి స్థితిలో కూర్చోవాలి. వికర్మలు వినాశనం చేసుకునేందుకు మనము బాబాను స్మృతి చేస్తాము. ఇందులో చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. బుద్ధి తెలియజేస్తుంది - బయట ఉండువారికైతే చిక్కులు-సమస్యలు, మిత్రులు-బంధువులు, గురువులు-సన్యాసులు మొదలైనవారి చికాకులుంటాయి, బుద్ధి అటువైపు పోవచ్చు. ఇక్కడ మీకైతే ఎటువంటి చిక్కు పనులు లేవు. మీరు ఎక్కువగా స్మృతి చేయవచ్చు, వీలైనంత ఎక్కువగా శివబాబాను స్మృతి చేయాలి. ఒకవేళ బంధు-మిత్రులు మొదలైనవారు గుర్తొస్తే, బుద్ధి ఎక్కడికైనా వెళ్ళిపోతే శిక్ష పడ్తుంది. యోగంలో ఉండకపోవడంతో మరి వాయుమండలాన్ని పాడుచేస్తారు. ఎవరైతే తండ్రి స్మృతిలో ఉంటారో వారందరు ఇలా ఉండరు. మా బుద్ధి యోగము కుదరడం లేదు, ఫలానా-ఫలానా గుర్తొచ్చాయి అని ఎప్పుడూ ఎవ్వరూ నిజం చెప్పరు. సత్యమైన పిల్లలు ‘‘బాబా మాతో ఈ పాపం జరిగింది ఫలానా వారిని కోప్పడ్డాను, కొట్టాను.’’ అని బాబాకి వెంటనే వచ్చి చెప్తారు. అయితే చాలా మంది పిల్లలు నిజం ఎప్పుడూ చెప్పరు. అందువలన ఇంకా పక్కాగా అభ్యాసమైపోతుంది. వికర్మలు ఎక్కువవుతూంటాయి. ఇంతకుముందు మమ్మా కచేరీ నిర్వహించేవారు. ఎవ్వరూ వికర్మలైతే చెయ్యలేదు కదా అని అడిగేవారు. సత్యం చెప్పకపోతే ఇంకా ఎక్కువగా శిక్ష పడ్తుంది అని బాబా అర్థము చేయిస్తారు. లాభానికి బదులు నష్టం కలుగుతుంది. సత్యంగా చాలా కొద్దిమంది ఉన్నారు, వారు సత్యమైన బాబా సేవలో సత్యంగా ఉంటారు. ఎవరికైనా తండ్రి పరిచయం ఇవ్వడం చాలా సహజం, కానీ ప్రదర్శనీ మొదలైన వాటికి జనం చాలామంది వస్తారు, అయితే చాలా కొద్దిమందే అర్థం చేసుకుంటారు. కేవలం ఏదైతే తప్పు భావము ఏర్పడి ఉంటుందో, అది తొలగిపోతుంది. అందులో ఎవరైతే బ్రాహ్మణ కులానికి చెందినవారిగా ఉంటారో, వారి బుద్ధిలో కూర్చుంటుంది. మిగిలిన అసుర సంప్రదాయం వారికి ఎంత మాత్రము అర్థం కాదు. సంగమ యుగములోనే ఒక వైపు ఆసురీ సంప్రదాయము, రెండో వైపున దైవీ సంప్రదాయం ఉంటాయి. ఇప్పుడు మీరు దైవీ గుణాలు ధారణ చేసి దైవీ సంప్రదాయము వారిగా అవుతున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ సంప్రదాయానికి చెందినవారు, వారు శూద్ర సంప్రదాయానికి చెందినవారు. ఈ రహస్యాలన్నీ మీకు మాత్రమే తెలుసు. మనము 84 జన్మల చక్రంలో తిరిగాము. ఇప్పుడు చక్రం మరలా తిరుగుతుంది. ఇప్పుడు చక్రం పూర్తవుతుంది. మళ్లీ ఇక్కడి నుండి పైకి వెళ్లాలి. మిగిలినవారు చిత్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కొంచెం కూడా అర్థం చేసుకోరు, అందుకే తండ్రి చెప్తారు - వారు ఆసురీ సంప్రదాయం వారు, రాతి బుద్ధి గలవారు, ఈ పేర్లన్నీ నిర్ణయమై ఉన్నాయి.
తండ్రి -‘‘నేను పేదల పాలిటి పెన్నిధిని’’ అని అర్థము చేయిస్తారు. పేదలే దానం తీసుకుంటారు. ఇక్కడకు కూడా పేదలే వస్తారు. వారినే ఉద్ధరించేందుకు ప్రయత్నం చేయండి. ఉదాహరణానికి కురుక్షేత్రంలో కుమారుడు లక్షణ్ ఉన్నాడు కదా, అతనికి సేవ పై చాలా ఆసక్తి ఉంది. సమయం దొరికితే గ్రామ-గ్రామానికి ప్రొజెక్టరుతో వెళ్లి సర్వీస్ చేస్తాడు. మేము మీకు వరల్డ్ హిస్టరీ-జాగ్రఫీ ప్రొజెక్టరు ద్వారా అర్థం చేయిస్తామని ముందే సూచన (ప్రకటన) ఇస్తాడు. బాబా తెలియజేశారు - ఒక్కొక్క చిత్రం అర్థం చేయించి వీరు పరమపిత పరమాత్మ అనంతమైన తండ్రి అని పక్కా చేయించండి. పరమాత్మ జన్మ భారతదేశంలోనే జరుగుతుంది. శివజయంతిని భారతదేశంలోనే జరుపుకుంటారు. బాబా భారతదేశంలోనే వచ్చి బ్రహ్మ ద్వారా విష్ణుపురిని స్థాపన చేస్తారు. త్రిమూర్తి చిత్రం ఎంత ఫస్ట్‌క్లాస్‌గా ఉంది! దానిని గురించిన జ్ఞానం ఎవ్వరికీ కొద్దిగా కూడా లేదు. త్రిమూర్తి పేరుతో ఒక ఇల్లుంటే, త్రిమూర్తి పేరు ఎందుకు పెట్టారు? త్రిమూర్తి ఎవరు? అని అడగాలి. త్రిమూర్తి ఎవరి జ్ఞాపకచిహ్నం? అని అడుగుతూ వార్తాపత్రికలలో కూడా వెయ్యవచ్చు. మార్గాలు మొదలైన వాటికి కూడా పేరు పెట్టే ఒక కమిటీ ఉంటుంది. కానీ భారతీయులకు వారు ఎవరిని పూజ చేస్తారో, వారి కర్తవ్యము గురించి కూడా తెలియదు. తెలిస్తే తమను దేవీ-దేవతా ధర్మం వారిగా చెప్పుకునేవారు, కానీ రావణరాజ్యం ప్రారంభమయినప్పటి నుండి తమను హిందువులుగా చెప్పుకుంటున్నారు ఇంకా భారతఖండానికి బదులు హిందుస్థాన్ ఖండమని చెప్తున్నారు. హిందుస్తాన్ అనే పేరు రావణరాజ్యం నుండి ప్రారంభమయ్యింది. ఇప్పుడీ విషయాలు తీరిక ఉన్నవారు కూర్చొని అర్థం చేసుకుంటారు. తీరిక కూడా దేవత అయ్యేవారికి మాత్రమే దొరుకుతుంది. వారే వస్తూ ఉంటారు. వారి ఎముకలను ఇప్పుడు మెత్తగా చేస్తారు. జ్ఞానము మరియు యోగాగ్నితో రాతి బుద్ధిగల వారిని మెత్తగా చేయడం జరుగుతుంది. ప్రదర్శనీలో అద్భుతంగా అర్థం చేయించడం చూచి మెత్తబడిపోతారు కదా! కొందరైతే పూర్తి రాయిలాగా ఉంటారు. తుపాకి మందు(గన్ పౌడర్) లేకుండా చక్కబడరు. మీరైతే శ్రమ పడాలి. చివర్లో కొంతమంది ఉండిపోవాలి కూడా కదా! ఎవరైతే నిర్భయంగా ఉంటారో, బుద్ధి యోగము ఒక్క తండ్రితో జోడింపబడి ఉంటుందో, వారు మాత్రమే ఉంటారు. చాలా మందికి భయం అనే జబ్బు కూడా ఉంటుంది. బాబా కంటే నీవు చాలా నిర్భయుడవని బాబా రాత్రి శివబాలకునికి చెప్తూ ఉండినారు. ఆవులంటే భయపడవు. యజమాని లేకుండా ఎవ్వరినీ రానీయవు. ఈ రోజుల్లో జంతువులకున్నంత తెలివి కూడా మనుష్యులకు లేదు, అందుకే వానర సంప్రదాయం అని అంటారు. నారదుడు కూడా మనిషే కదా. కానీ అతనికి నీ ముఖం చూసుకో, నీలో ఆసురీ గుణాలన్నాయి అని చెప్పారు. దేహాభిమానం నంబర్ వన్ ఆసురీ గుణము. భగవంతుడు స్వయంగా ఇది వానర సేన అని చెప్పారు. సీత దొంగిలించబడింది, వానర సేనను తీసుకున్నారు - అని శాస్త్రాల్లో వ్రాశారు. నిజానికి రావణుడు కూడా ఎవ్వరూ లేరు, పది తలల రావణుడు సీతను ఎలా ఎత్తుకుపోగలడు, చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. ఎటువంటి రాతిబుద్ధి మనుష్యులున్నారంటే అన్నింటికీ సత్యం-సత్యం అని అంటూ ఉంటారు వానర సేన ఎక్కడి నుండి వస్తుంది? ఇప్పుడు కలియుగ మనుష్యులే కోతుల వలె ఉన్నారని నిరూపించబడింది. తండ్రి వచ్చి మరలా దేవతగా తయారుచేస్తారు. భారతదేశం ఎలా ఉండేదో మీరు అందరికీ అర్థము చేయిస్తారు. బాబా వచ్చి పతితులను పావనంగా చేశారు. అయితే ఇక్కడ కంసుడు, జరాసంధుడు, శిశుపాలుడు మొదలైన వారున్నారని బాబాయే చెప్తున్నారు. వారి యాక్టివిటీ అయితే నడుస్తున్నది కదా. ఇవి సంగమయుగ విషయాలు. బాబా తెలియచెప్పే దానికి, శాస్త్రాల్లో ఉన్నదానికి ఎంత తేడా ఉంది! రాత్రి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. రావణరాజ్యం ప్రారంభమైనప్పటి నుండి స్వయాన్ని హిందువులమని చెప్పుకుంటున్నారు. గుర్తుగా జగన్నాథుని మందిరం ఉంది. దేవతలు వామమార్గంలోకి వెళ్లినప్పుడు హిందుస్తాన్ అని పేరు పెట్టబడింది. హిందువు, హిందువు అని అంటూ ఉంటారు. హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించారని అడిగితే చెప్పలేరు. లక్షీనారాయణులను హిందువులని ఎంతమాత్రము అనరు. వారైతే దేవీ-దేవతలు కదా.
మధురాతి మధురమైన గారాబు పిల్లలూ, మీరైతే ఇక్కడ ప్రియుని, తండ్రి జతలో ఉన్నారు. మీ కొరకు ఇక్కడ డైరెక్ట్ జ్ఞాన వర్షం కురుస్తుంది. కనుక మీరు ఎంత మంచిగా తయారవ్వాలి. ఇది శివబాబా రుద్ర జ్ఞాన యజ్ఞము. బ్రాహ్మణులైన మీరు యజ్ఞ రక్షకులు. ఎల్లప్పుడూ బ్రాహ్మణులే యజ్ఞాన్ని సంభాళిస్తారు, బ్రాహ్మణులు ఎంత సమయం యజ్ఞము రచిస్తారో, ఆ సమయము పతితంగా అవ్వరు. ఇది చాలా భారీ యజ్ఞం. బ్రాహ్మణులు ఎప్పుడూ పతితంగా అవ్వరాదు. మేము పతితమైపోయాము అని బాబాకు ఉత్తరం వ్రాసి పంపిస్తారు. అరే...! ఇది శివబాబా యజ్ఞము, ఇందులో బ్రాహ్మణులందరూ యజ్ఞ రక్షకులు, విరుద్ధమైన పనులు చెయ్యకూడదు. పూర్తి దేహీ-అభిమానులుగా ఉండాలి. వారిలో ఎటువంటి వికారాలు ఉండరాదు. స్వయాన్ని సంభాళించుకోవాలి (కాపాడుకోవాలి). లేకపోతే వారిని కోతులని అంటారు. చాలా పెద్ద పాపానికి అధికారిగా తయారైపోతారు. బ్రాహ్మణులుగా అయ్యి ఒకవేళ పాప కర్మలు చేస్తే దానికి శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. ఇది పాస్ట్(గత) కర్మభోగం అని అంటారు. ఇప్పుడు బాబా కర్మాతీతులుగా తయారు చేస్తున్నారు. ఎటువంటి వికర్మలూ చెయ్యకండి. బ్రాహ్మణులలో ఎటువంటి భూతమూ ఉండరాదు. ఉంటే రావణుని అంశమైపోతారు. ఇక్కడికీ కాకుండా, అక్కడికీ కాకుండా అయిపోతారు. ఇది శివబాబా యజ్ఞం కదా. ఏదైనా పాపకర్మ చేస్తే చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఒకవేళ యజ్ఞంలో ఎవరైనా అపవిత్ర కర్మలు చేస్తే చాలా పెద్ద శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. చాలా మధురంగా తయారవ్వాలి. ఆసురీ మనుష్యులు ఏవైనా పొరపాట్లు మొదలైనవి చేస్తుంటారు కానీ పిల్లలైన మీరు ఎప్పుడూ క్రోధంలోకి రాకూడదు. సత్యమైన బ్రాహ్మణులు చాలా చాలా సత్యంగా ఉండాలి. ఎవరు వచ్చినా, వారికి మనం దారి చెప్పాలి. బాబా చెప్తారు - నేను గాలిపటం ఎగరేస్తున్నా ఎవరైనా ఎదురుగా వస్తే వారికి కూడా అర్థం చేయించగలను. బాబాను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. ఇది ఎవరికైనా మీరు అర్థం చేయించవచ్చు. అయితే స్వయంలో గుణాలు ఉండాలి. ఎలాంటి సైతాను పనులు చేయరాదు. చేస్తే చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. ఇది మహాభయంకరమైన మహాభారత యుద్ధం. నూతన ప్రపంచం కొరకు బాబా రాజయోగం నేర్పుతున్నారు. పాత ప్రపంచము వినాశనం అవ్వాల్సిందే. ఇది మీరు అందరికీ అర్థం చేయంచవచ్చు. కానీ మొదట మీ అవగుణాలను తొలగించండి, అప్పుడే 16 కళా సంపూర్ణులుగా అవుతారు. యజ్ఞ బ్రాహ్మణులు యజ్ఞాన్ని చాలా సంభాళించాలి. చాలా మధురంగా తయారవ్వాలి. ఎవరు చూసినా, వీరిలో ఎటువంటి దేహాభిమానము లేదు అని అనాలి. అతిథులకు ఎల్లప్పుడూ సత్కారాలు చెయ్యాలి. సుపుత్రులు తండ్రిని ప్రత్యక్షము చేసేందుకు చాలా మర్యాద చేస్తారు. బాబా పిల్లలు చాలామందికి అందరికి అర్థం చేయిస్తూ ఉంటారు. బాబా భారతదేశంలో అనంతమైన యజ్ఞం రచించారు. బ్రాహ్మణులైన మీరే మరలా విశ్వానికి అధిపతులుగా అవుతారు. శ్రమ చెయ్యాలి. పవిత్రత గురించి ఎన్ని జగడాలు జరుగుతాయి. స్త్రీ జ్ఞానంలో ఉండి పురుషుడు లేకపోతే తప్పకుండా వివాదాలు ఏర్పడతాయి. పిల్లలైన మీరైతే సంతోషంగా డ్యాన్సు చెయ్యాలి. కానీ ఇందులో అంతా గుప్తం. ఆత్మకు సుఖానుభూతి కలుగుతుంది కదా. మనం భవిష్యత్తులో విశ్వానికి అధిపతులుగా అవుతాము, ఇక్కడ ఉండే వారికైతే చాలా సులభం. ఎటువంటి చిక్కు సమస్యలు మొదలైనవేవీ ఉండవు. చాలా మధురంగా తయారవ్వాలి. భూతనాథులుగా అయ్యారంటే విశ్వానికి అధిపతులుగా ఎలా అవ్వగలరు? తమ సంపాదనకు మచ్చ వేసుకుంటారు. భూతాలను ఒక్కసారిగా వెడలగొట్టాలి. మంచి పిల్లల పని జాగ్రత్తగా ఉండటం. మనము ఎప్పుడూ తండ్రి పేరు పాడు చెయ్యము. భూతము ప్రవేశించినప్పుడు మాలో భూతం ఉంది అని వారికి తెలియదు. పంచ వికారాలను భూతములని అంటారు. వారు వైస్‌లెస్(నిర్వికారులు), ఇది వికారీ విషస్ ప్రపంచము అయినా ఎవ్వరూ అంగీకరించరు. చాలా మతాలు-మతాంతరాలు ఉన్నాయి కదా. డ్రామానుసారంగా బాబాయే వచ్చి ఒకే మతాన్ని తయారుచేస్తారు. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. ఒకే మతం ఉండాలి అని కేవలం చెప్తూ ఉంటారు, అరే! అనేక ధర్మాలు, అనేక మతాలు ఉన్నప్పుడు ఒకే మతంగా ఎలా అవుతుంది? ఒకే ధర్మము, ఒకే మతము ఉండేది స్వర్గంలోనే. మనుష్యులు ఎవ్వరూ స్వర్గ స్థాపన చేయలేరు. ఎంత వండర్‌ఫుల్ విషయాలు! ఎవరైనా విచార సాగర మథనం చేస్తూ ఉన్నా భూతాలకు ప్రవేశం ఉండదు. ఏదైనా భూతం ప్రవేశించిందంటే రూపమే మారిపోతుంది. ఎవరినైనా మనిషి నుండి దేవతగా తయారు చేసి చూపించండి. ఇది మీ ప్రచార సంస్థ(మిషనరీ). తోటమాలి మంచి-మంచి పూలమొక్కలను అంటు కట్టి తోటను పెద్దదిగా చేస్తే యజమాని కూడా వచ్చి చూడాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్, ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.ధారణ కొరకు ముఖ్య సారము:-1. ఏదైనా భూతానికి వశమై తమ సంపాదన నష్టపోరాదు. భూతాలను పూర్తిగా తొలగించి సుపుత్రులుగా అవ్వాలి.2. వికర్మాజీతులుగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు కనుక ఎలాంటి వికర్మలు చేయరాదు. చాలా-చాలా మధురంగా తయారవ్వాలి. అందరికీ తండ్రి పరిచయం ఇవ్వాలి, నిర్భయంగా ఉండాలి.వరదానము:-తండ్రి సమానంగా లైట్-మైట్‌హౌస్‌గా అయ్యేందుకు ఏ విషయాన్ని చూచినా, విన్నా దాని సారాన్ని తెలుసుకొని ఒక్క సెకండులో ఇముడ్చుకోవాలి లేక పరివర్తన చేసుకునే అభ్యాసం చేయండి. ఎందుకు, ఏమి అనే ప్రశ్నల విస్తారంలోకి వెళ్లకండి. ఎందుకంటే ఏ విషయంలోనైనా విస్తారంలోకి వెళ్లుట వలన సమయము, శక్తులు వ్యర్థమైపోతాయి కనుక విస్తారాన్ని ఇముడ్చుకొని సారంలో స్థితమయ్యే అభ్యాసం చేయండి. దీనితో ఇతర ఆత్మలకు కూడా ఒక్క సెకండులో మొత్తం జ్ఞాన సారమునంతా అనుభవం చేయించగలరు.
స్లోగన్:-మీ వృత్తిని పవర్‌ఫుల్‌గా చేసుకుంటే సేవ స్వతహాగా వృద్ధి చెందుతుంది.
I like to invite you on our YouTube Channel
 
