Pages

04-12-2016 అవ్యక్తబాప్‌దాదా ఓంశాంతి రివైజ్‌ - 15-12-99 మధువనము

04-12-2016 అవ్యక్తబాప్‌దాదా ఓంశాంతి రివైజ్‌ - 15-12-99 మధువనము


‘‘సంకల్పశక్తి మహత్వాన్ని తెలుసుకొని దానిని పెంచుకోండి, ప్రయోగములోకి తీసుకు రండి’’
ఈ రోజు ఉన్నతోన్నతమైన తండ్రి నలువైపులా ఉన్న తన శ్రేష్ఠమైన పిల్లలను చూసి హర్షితమౌతున్నారు. ఎందుకంటే విశ్వములో ఉన్న ఆత్మలందరిలో పిల్లలైన మీరు శ్రేష్ఠమైనవారు అనగా అత్యంత ఉన్నతమైనవారు(హైయెస్ట్‌). ప్రపంచములోని వారు హైయెస్ట్‌ ఇన్‌ ద వరల్డ్‌(Highest In The World) అని అంటారు. కానీ అది ఒక్క జన్మ కొరకే కానీ పిల్లలైన మీరు మొత్తం కల్పంలోనే హైయెస్ట్‌(శ్రేష్ఠమైనవారు). మొత్తం కల్పమంతా మీరు శ్రేష్ఠంగా ఉంటారు. మీకు తెలుసు కదా? మీ అనాది కాలాన్ని గమనించండి - అనాది కాలంలో కూడా ఆత్మలైన మీరంతా తండ్రికి సమీపంగా ఉండేవారు. చూస్తున్నారా! మీరు అనాది (బిందు) రూపంలో తండ్రితో పాటు తండ్రికి సమీపంగా ఉండే శ్రేష్ఠమైన ఆత్మలు. అందరూ ఉంటారు కానీ మీ స్థానము తండ్రికి చాలా సమీపంగా ఉంటుంది. కనుక అనాది రూపంలో కూడా అత్యంత ఉన్నతమైనవారు. తర్వాత ఆదికాలంలోకి రండి - ఆది కాలములో పిల్లలైన మీరంతా దైవీ పదవిని ధరించి దేవతా రూపంలో ఉంటారు. మీ దైవీ స్వరూపము గుర్తుందా? ఆది కాలములో మీరు సర్వ ప్రాప్తి స్వరూపులుగా ఉంటారు. తనువు-మనసు-ధనము-జనము నాలుగు స్వరూపాలలోనూ శేష్ఠ్రమైనవారు. సదా సంపన్నంగా సర్వ పాప్త్రి స్వరూపంగా ఉంటారు. ఇటువంటి దైవీ పదవి ఏ ఇతర ఆత్మలకు పాప్త్రించదు. వారు ధర్మాత్మలు కావచ్చు, మహాత్మలు కావచ్చు కానీ ఇటువంటి సర్వ పాప్త్రులలో శేష్ఠ్రంగా, అపాప్త్రికి నామ-రూపాలు కూడా లేకుండా ఎవ్వరూ అనుభవం చేయలేరు. తర్వాత మధ్య కాలంలోకి రండి - మధ్య కాలంలో కూడా ఆత్మలైన మీరు పూజ్యులుగా అవుతారు. మీ జడచిత్రాలు కూడా పూజింపబడ్తాయి. ఇటువంటి విధి పూర్వకమైన పూజలు ఎవ్వరికీ జరగవు. పూజ్య ఆత్మలకు జరిగేటంత విధి పూర్వకమైన పూజలు మరెవ్వరికైనా జరుగుతున్నాయా, ఆలోచించండి. ప్రతీ కర్మకు పూజ జరుగుతుంది. ఎందుకంటే మీరు కర్మయోగులుగా అవుతారు, కనుక పూజ కూడా ప్రతీ కర్మకు జరుగుతుంది. ధర్మాతలు లేక మహాన్‌ ఆత్మల చిత్రాలను మీ జడచిత్రాల జతలో మందిరాలలో కూడా ఉంచవచ్చు కానీ వాటికి విధిపూర్వకమైన పూజ జరగదు. కనుక మధ్యకాలంలో కూడా హైయెస్ట్‌ అనగా శ్రేష్ఠమైనవారు. తర్వాత వర్తమాన అంతిమ కాలానికి రండి. అంతిమ కాలంలో కూడా ఇప్పుడు సంగమయుగంలో మీరు శ్రేష్ఠమైన ఆత్మలు. ఏ శ్రేష్ఠత ఉంది? స్వయం బాప్‌-దాదా పరమాత్మ మరియు ఆది ఆత్మ అనగా బాప్‌దాదా ఇరువురి ద్వారా పాలన కూడా తీసుకుంటారు, చదువు కూడా చదువుకుంటున్నారు అంతేకాక జతలో సద్గురువు ద్వారా శ్రీమతము తీసుకునేందుకు అధికారులుగా అయ్యారు. కనుక అనాది కాలము, ఆది కాలము, మధ్య కాలము మరియు ఇప్పుడు అంతిమ కాలంలో కూడా హైయెస్ట్‌గా ఉన్నారు. ఇంత నషా ఉంటుందా?

ఈ స్మృతిని ఎమర్జ్‌(ఉత్పన్నము) చేయమని బాప్‌దాదా చెప్తున్నారు. మనసులో, బుద్ధిలో ఈ ప్రాప్తిని మరలా మరలా గుర్తు చేసుకోండి. స్మృతిని ఎంతగా ఎమర్జ్‌గా ఉంచుకుంటారో, అంత ఆ స్మృతిలో ఆత్మిక నషా ఉంటుంది, సంతోషముంటుంది, శక్తిశాలురుగా అవుతారు. ఇంత హైయెస్ట్‌ ఆత్మలుగా అయ్యారు. మేమే ఒకప్పుడు హైయెస్ట్‌గా, శ్రేష్ఠంగా ఉండినాము, ఇప్పుడు అయ్యాము, మళ్లీ సదా అవుతూనే ఉంటాము అనే నషా ఉందా? నిశ్చయం పక్కాగా ఉంటే చేతులెత్తండి. టీచర్లు కూడా ఎత్తారు.

మాతలైతే సదా సంతోషమనే ఊయలలో ఊగుతూ ఉంటారు. ఊగుతున్నారు కదా. మాతలకు చాలా నషా ఉంటుంది. ఏ నషా ఉంటుంది? మా కోసమే తండ్రి వచ్చారనే నషా ఉంది కదా! ద్వాపరయుగము నుండి అందరూ మిమ్ములను క్రింద పడేశారు. అందువలన తండ్రికి మాతలంటే చాలా ప్రేమ. ముఖ్యంగా మాతల కోసమే తండ్రి వచ్చారు. ఇప్పుడు సంతోషిస్తున్నారు. కానీ సదా సంతోషంగా ఉండాలి. అలాగని ఇప్పుడు చేతులెత్తుతూ రైలు ఎక్కగానే కొద్ది కొద్దిగా నషా దిగిపోరాదు. నషా సదా ఏకరసంగా, అవినాశిగా ఉండాలి. అప్పుడప్పుడు నషా ఉండడం కాదు. సదాకాలిక నషా సదా సంతోషాన్నిస్తుంది. మాతలైన మీ ముఖాలు సదా ఇలాగే దూరము నుండే ఆత్మిక గులాబీ పుష్పాల వలె కనిపించాలి. ఎందుకంటే ఈ విశ్వవిద్యాలయంలో అందరికీ ఒక విషయం ఇష్టమనిపిస్తుంది, ఒక విశేషత కనిపిస్తుంది. అదేమిటంటే మాతలు ఆత్మిక గులాబీల వలె సదా వికసించిన పుష్పాల వలె ఉంటారు. అంతేకాక మాతలే బాధ్యత వహించి ఇంత గొప్ప కార్యము చేస్తున్నారు. మహామండలేశ్వరులు కూడా ఇక్కడ మాతలు నిమిత్తులై ఇంత శ్రేష్ఠమైన కార్యాన్ని సులభంగా నడిపిస్తున్నారని అనుకుంటున్నారు. మాతలను గురించి - ‘‘ఇద్దరు మాతలు కలిసి ఏదైనా ఒక పని చేయడం చాలా కష్టమని అంటారు. అది నిజం కాదు, కాని అలా అంటారు. కాని ఇక్కడ నిమిత్తులుగా ఎవరున్నారు? మాతలే కదా! ఎవరైనా కలుసుకునేందుకు వస్తే ఏమి అడుగుతారు? మాతలు నడిపిస్తున్నారా? పరస్పరము పోట్లాడుకోవడం లేదా? గొడవ పడడం లేదా? అని అడుగుతారు. కానీ వీరు సాధారణ మాతలు కారని, పరమాత్ముని ద్వారా నిమిత్తంగా చేయబడిన ఆత్మలని, పరమాత్ముని వరదానం వీరిని నడిపిస్తూ ఉందని వారికేం తెలుసు. అలాగని మాతలకేనా గౌరవం, మాకు లేదా అని సోదరులు(పాండవులు) అనుకోకండి. మీకు కూడా మహిమ ఉంది. పంచ పాండవులని మహిమ చేయబడ్డారు. శక్తులతో పాటు పాండవులను కూడా చూపిస్తారు. 7 మంది శీతలాదేవీలను, ఒక పాండవున్ని కూడా చూపిస్తారు. పాండవులు లేకుండా మాతలు నడిపించలేరు, మాతలు లేకుండా పాండవులు నడిపించలేరు. రెండు భుజాలూ అవసరమే. కానీ మాతలను చాలా క్రిందికి పడేశారు కదా. అందువలన తండ్రి మాతల గురించి ప్రపంచము వారు ఏదైతే అసంభవమని భావిస్తారో, అది సంభవము చేసి చూపిస్తున్నారు. మీకు మాతలను చూచి సంతోషంగా ఉంది కదా? లేక సంతోషంగా లేరా? సంతోషంగానే ఉన్నారు కదా! ఒకవేళ తండ్రి మాతలను నిమిత్తంగా చేసి ఉండకపోతే ఇది కొత్త జ్ఞానము, కొత్త పద్ధతి అయినందున పాండవులను చూచి చాలా గలాటాలు జరిగేవి. మాతలు ఢాలు వంటివారు. ఎందుకంటే ఇది కొత్త జ్ఞానం, కొత్త విషయాలు కదా. అయితే సోదరీలతో పాటు సోదరులు సదా జతలోనే ఉంటారు. పాండవులు తమ కార్యంలో ముందుకు పోతున్నారు. అక్కయ్యలు కూడా తమ కార్యంలో ముందుకు పోతున్నారు. ఇరువురి సలహా ద్వారా ప్రతీ కార్యము నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది.

బాప్‌దాదా ప్రతి రోజు తమ పిల్లలు చేసే రకరకాల కార్యాలు చేస్తూ ఉంటారు. కొత్త కొత్త ప్లాన్లు తయారవుతూనే ఉంటాయి. సమయమైతే అందరికీ గుర్తుంది కదా? 99వ సంవత్సరమనే భ్రాంతి కూడా పూర్తి అయిపోయింది కదా. 99వ సంవత్సరం వచ్చేసింది, 99వ సంవత్సరం వచ్చేసింది అని అనుకునేవారు. కానీ మీ అందరికీ ఈ సంవత్సరం సేవ చేయడానికి, నిర్విఘ్నంగా ఉండడానికి లభించింది. 99వ సంవత్సరంలోనే మౌన భట్టీలు చేస్తున్నారు కదా. ప్రపంచములోని వారైతే భయపడ్తారు. కానీ వారెంతగా భయపడ్తారో, అంత మీరందరూ స్మృతి చేసి లోతుల్లోకి వెళ్తున్నారు. మనసా మౌనం అంటే జ్ఞానసాగరం లోతుల్లోకి వెళ్లి కొత్త కొత్త అనుభవాలనే రత్నాలను తీసుకురావడం. బాప్‌దాదా ఇంతకుముందు కూడా సూచించారు - వర్తమానాన్ని, భవిష్యత్తును తయారుచేసే శ్రేష్ఠమైన ఖజానా - శ్రేష్ఠ సంకల్పాల ఖజానా. సంకల్పశక్తి చాలా గొప్ప శక్తి. పిల్లలైన మీ వద్ద శ్రేష్ఠ సంకల్పాల శక్తి ఉంది. సంకల్పాలైతే అందరి వద్ద ఉన్నాయి. కానీ శ్రేష్ఠమైన శక్తి, శుభ భావన, శుభ కామనల సంకల్ప శక్తి, మనసు-బుద్ధిని ఏకాగ్రము చేసే శక్తి - ఈ శక్తులు మీ వద్ద మాత్రమే ఉన్నాయి. ఎంత ముందుకు వెళ్తారో, అంత ఈ సంకల్ప శక్తిని జమ చేసుకుంటూ పోతారు. వ్యర్థంగా పోగొట్టుకోరు. వ్యర్థంగా పోగొట్టుకునేందుకు ముఖ్య కారణం - వ్యర్థ సంకల్పాలు. మెజారిటి పిల్లలలో ఇంకా వ్యర్థముందని బాప్‌దాదా గమనించారు. ఎలాగైతే స్థూల ధనాన్ని పొదుపుగా వాడుకునేవారు సదా సంపన్నంగా ఉంటారో, వ్యర్థంగా పోగొట్టుకునేవారు ఎక్కడో అక్కడ మోసపోతారో అలా శ్రేష్ఠమైన శుద్ధ సంకల్పాలలో ఎంత శక్తి ఉందంటే మీ క్యాచింగ్‌(గ్రహించే) శక్తి, వైబ్రేషన్లను గ్రహించే శక్తి చాలా వృద్ధి చెందుతుంది. ఎలాగైతే ఈ వైర్‌లెస్‌, టెలిఫోన్‌........ మొదలైన సైన్సు సాధనాలు పని చేస్తాయో, అలా ఈ శుద్ధ సంకల్పాల ఖజానా కూడా పని చేస్తుంది. లండన్‌లో కూర్చొని ఉన్న ఏ ఆత్మ నుండి వచ్చే వైబ్రేషన్లనైనా మీరు వైర్‌లెస్‌, టెలిఫోన్‌, టి.వి మొదలైన సాధనాల ద్వారా గ్రహించే దానికంటే ఇంకా ఎక్కువ స్పష్టంగా మీ క్యాచింగ్‌ శక్తి, ఏకాగ్రతా శక్తి ద్వారా గ్రహించగలరు. ఈ ఆధారాలన్నీ తప్పక సమాప్తమైపోతాయి. ఈ సాధనాలన్నీ దేని ఆధారము పై పని చేస్తున్నాయి? కరెంటు ఆధారంతో. ఇప్పుడున్న మెజారిటీ సుఖ సాధనాలన్నీ కరెంటు ఆధారంతోనే పని చేస్తున్నాయి. మరి మీ ఆధ్యాత్మిక లైటు, ఆత్మిక లైటు ఈ పని చేయలేదా! దగ్గరి వైబ్రేషన్లను గానీ, దూరం నుండి వచ్చే వైబ్రేషన్లను గానీ క్యాచ్‌ చేయగలరు. ఇప్పుడు మనసు, బుద్ధి రెండూ ఏకాగ్రమవ్వాలి. ఏకాగ్రతాశక్తి ద్వారా క్యాచింగ్‌ శక్తి వస్తుంది. చాలా అనుభవం చేస్తారు. నిస్వార్థమైన, స్వచ్ఛమైన, స్పష్టమైన సంకల్పాలు చాలా త్వరగా అనుభవం చేయిస్తాయి. సైలెన్స్‌ శక్తి ముందు ఈ సైన్సు శక్తి తల వంచుతుంది. ఇప్పుడు కూడా సైన్స్‌లో ఏదో లోపముంది, దానిని నింపాలి అని భావిస్తున్నారు. అందువలన బాప్‌దాదా మరలా అండర్‌లైన్‌ చేయిస్తున్నారు (గమనమిప్పిస్తున్నారు) - అంతిమ స్థితి, అంతిమ సేవ ఏదంటే - ఈ సంకల్ప శక్తి చాలా వేగంగా సేవ చేయిస్తుంది. అందువలన సంకల్పశక్తి పై ఇంకా ఎక్కువగా ధ్యాస పెట్టండి, పొదుపు చేయండి, జమ చేయండి. ఇది చాలా పనికొస్తుంది. ఈ సంకల్పశక్తి ద్వారా ప్రయోగము చేసేవారిగా అవుతారు. సైన్సుకు గొప్పతనము ఎందుకు ఉంది? ప్రయోగములోకి వస్తుంది. అందుకే సైన్సు బాగా పని చేస్తుందని భావిస్తారు. అలాగే సైలెన్స్‌ శక్తిని ప్రయోగించేందుకు ఏకాగ్రతా శక్తి కావాలి. అయితే ఏకాగ్రతకు మూలాధారము - మనసును కంట్రోల్‌ చేసుకునే శక్తి. దీని ద్వారా మనోబలము పెరుగుతుంది. మనోబలానికి చాలా మహిమ ఉంది. క్షుద్రశక్తులు, మంత్ర తంత్రాలు చేయువారు కూడా మనోబలం ద్వారా అల్పకాలిక చమత్కారాలు చూపిస్తారు. కానీ మీది విధి పూర్వకమైనది. మంత్ర-తంత్రాలు కావు. మీరు విధి పూర్వకంగా అందరికీ కళ్యాణమయ్యే అద్భుతాన్ని చూపిస్తారు. అది వారికి వరదానమైపోతుంది. ఈ సంకల్పశక్తి ప్రయోగము ఆత్మలకు వరదానంగా సిద్ధిస్తుంది. కనుక మొదట మనసును అదుపులో ఉంచుకునే కంట్రోలింగ్‌ శక్తి ఉందా? అని చెక్‌ చేసుకోండి. సైన్స్‌ శక్తి స్విచ్‌ ఆన్‌ చేస్తే సెకండులో పని చేస్తుంది, ఆఫ్‌ చేస్తే ఆగిపోతుంది. అలా మనసును ఒక సెకండులో ఎక్కడకు కావాలంటే అక్కడకు, ఎంత సమయము కావాలంటే అంత సమయము కంట్రోల్‌ చేయగలుగుతున్నారా? ఈ శక్తి ద్వారా స్వయం కొరకు, సేవ కొరకు చాలా మంచి-మంచి సిద్ధి స్వరూపాలు కనిపిస్తాయి. కానీ సంకల్పశక్తి జమ అయ్యే ఖాతా పై గమనము (ధ్యాస) ఇంకా సాధారణంగానే ఉందని బాప్‌దాదా గమనించారు. ఎంత ఉండాలో, అంత లేదు. సంకల్పాల ఆధారం పై మాటలు, కర్మలు స్వతహాగా నడుస్తాయి. వేరు వేరుగా శ్రమ చేసే అవసరం లేదు. ఈ రోజు మాటలు అదుపు చేయాలి, ఈ రోజు దృష్టి పై గమనముంచేందుకు శ్రమించాలి, ఈ రోజు వృత్తి పై గమనముంచి మార్చుకోవాలని అనిపించదు. సంకల్పశక్తి పవర్‌ఫుల్‌గా ఉంటే ఇవన్నీ స్వతహాగానే అదుపులోకి వచ్చేస్తాయి. శ్రమ నుండి రక్షింపబడ్తారు. కనుక సంకల్పశక్తికి గల గొప్పతనాన్ని తెలుసుకోండి.

ఇది అలవాటు చేసుకునేందుకే విశేషంగా భట్టీలు పెడ్తారు. ఇక్కడి ఈ అలవాటు భవిష్యత్తులో కూడా అటెన్షన్‌ ఇప్పిస్తూ ఉంటుంది. అప్పుడది అవినాశిగా అవుతుంది. గొప్పతనమేమిటో అర్థమయిందా? మీ వద్ద తండ్రి ఇచ్చిన అత్యంత ఉన్నతమైన ఖజానా ఉంది. శ్రేష్ఠ సంకల్పాలు, శుభ భావన, శుభ కామనలతో కూడిన సంకల్పశక్తి అనే ఖజానా ఉందా? తండ్రి ఈ ఖజానా అందరికీ ఇచ్చారు. కానీ నంబరువారుగా జమ చేసుకుంటున్నారు. ప్రయోగములోకి తెచ్చే శక్తి కూడా నంబరువారీగా ఉంది. శుభ భావన, శుభకామనల ప్రయోగం ఇప్పుడు కూడా చేశారా? విధిపూర్వకంగా చేయడం ద్వారా సిద్ధి(సఫలత) అనుభవమవుతూ ఉందా? ఇప్పుడు కొద్ది కొద్దిగా అవుతుంది. చివరికి మీ సంకల్పశక్తి ఎంత గొప్పదిగా అయిపోతుందంటే - ఇప్పుడు నోటి ద్వారా సందేశమిచ్చేందుకు సమయాన్ని, ధనాన్ని కూడా ఉపయోగిస్తున్నారు, అలజడిలోకి కూడా వస్తున్నారు, అలసిపోతున్నారు కూడా...... కానీ శ్రేష్ఠ సంకల్పాలతో చేయు సేవలో ఇవన్నీ పొదుపు చేయబడ్తాయి. కనుక ఈ శక్తిని పెంచుకోండి. దీనిని పెంచుకుంటే ప్రత్యక్షత కూడా త్వరగా జరుగుతుంది. ఇప్పుడు 62 - 63 సంవత్సరాలు అయిపోయాయి. ఇంత సమయంలో ఎంతమంది ఆత్మలను తయారుచేశారు? ఇంకా 9 లక్షలు కూడా పూర్తి కాలేదు. విశ్వమంతటికీ సందేశమివ్వాలంటే ఎన్ని కోట్ల ఆత్మలున్నారు? ఇప్పటివరకు భగవంతుడు వీరికి టీచరుగా ఉన్నారు, వీరిని భగవంతుడు నడిపిస్తున్నారు, చేయించే పరమాత్ముడే చేయిస్తున్నారు....... ఇంకా ఈ విషయాలే స్పష్టమవ్వలేదు. ఇది మంచి పని, శ్రేష్ఠ కార్యం చేస్తున్నారు అనే మాట అయితే వచ్చింది కానీ ఇంకా చేయించేవారు గుప్తంగా ఉన్నారు. కనుక ఈ సంకల్ప శక్తి ద్వారా ప్రతి ఒక్కరి బుద్ధి పరివర్తన చేయగలరా? ఓహో! ప్రభూ నీ లీల,...... అనే రూపంలో అయినా, తండ్రి రూపంలో అయినా ప్రత్యక్షమవ్వాలి. కనుక బాప్‌దాదా ఇప్పుడు కూడా మళ్లీ సంకల్ప శక్తిని పెంచి ప్రయోగములోకి తీసుకురండి అని గమనమిప్పిస్తున్నారు. అర్థమయిందా.

మంచిది. ఈ రోజు మాతల ఛాన్స్‌. ఒకటి మాతల గ్రూపు, రెండవది మెడికల్‌ గ్రూపు - రెండు వర్గాలు. మాతలు ఏ అద్భుతం చేస్తారు? మెంబరుగా అయితే అయ్యారా? మహిళా వర్గములో సభ్యులుగా అయ్యారు. మంచిదే కదా. సభ్యులుగా అయినవారు మంచి పని చేశారు. ఇప్పుడు మీ అందరి లిస్టు ప్రభుత్వానికి పంపిస్తాము. ఎందుకు? భయపడకండి. ఆదాయపు పన్ను వారు మీ వద్దకు రారు. ఈ మాతలందరూ ఇప్పుడు జగన్మాతలుగా అయ్యి ప్రపంచాన్ని బాగు చేస్తారని తెలిపేందుకు మీ లిస్టు పంపుతాము. ఈ పని చేస్తున్నారు కదా? ప్రభుత్వానికి ఈ మాతలు ఈ ప్రపంచాన్ని స్వర్గంగా తయారు చేసేవారని మీ పేర్లు పంపమంటారా? పంపమంటారా? చేతులెత్తండి. భయపడడం లేదు కదా, భయపడకండి. కానీ ముందు మీ ఇల్లు స్వర్గంగా అయ్యిందా అని ఎంక్వయిరీ చేస్తారు. ఎందుకంటే ముందు ఇల్లు, తర్వాత విశ్వం. కనుక ఎవరైనా మాత వద్దకు వచ్చి మీ ఇంట్లో సుఖ - శాంతులున్నాయా అని చూడమంటారా? అప్పుడు కనిపిస్తుంది. మీ ఇంటిని స్వర్గంగా చేసుకుంటారా? లేక ఇంటిని వదిలి విశ్వాన్ని స్వర్గంగా చేస్తారా? మొదట మీ ఇంటిని చేసుకుంటే అప్పుడు ఇతరుల పై కూడా మీ ప్రభావము పడ్తుంది. లేకుంటే ఈమె ఇంట్లో స్వర్గమెక్కడుంది? కొట్లాటలున్నాయని అంటారు. అందువలన ఎవరైనా చూస్తే మాతలు బాగా పరివర్తనయ్యారని అనిపించేలా వాయుమండలాన్ని తయారుచేయాలి. సభ్యులుగా అయినవారు చేతులెత్తండి. సభ్యులు ఎంతమంది ఉన్నారు? (ఒక వెయ్యి మంది వచ్చారు). ఇప్పుడు వెయ్యిమంది అంటే ఎక్కువే. చేతులెత్తిన వారి ఇండ్లలో సుఖ -శాంతులున్నాయా? ఉన్నాయి అనేవారు చేతులెత్తండి. నిల్చోండి. అర్థమయ్యిందా లేక ఊరకే నిల్చున్నారా? ఇల్లు స్వర్గంగా ఉందా? ఇంట్లో శాంతి ఉందా? మంచిది. వీరి ఫోటో తీయండి. మంచిది.

నలువైపులా ఉన్న శ్రేష్ఠ ఆత్మలకు, ఆదిమధ్యాంతాలలో శ్రేష్ఠ పాత్రను అభినయించే వారికి, సదా తమ శ్రేష్ఠ విధిని అనుభవం చేయువారికి, సదా సహజయోగితో పాటు ప్రయోగులుగా అయ్యే ఆత్మలకు, సదా సంకల్పశక్తి ద్వారా అన్ని శక్తులను పెంచుకునేవారికి, మనసు-బుద్ధిని అదుపు చేసుకునే వారికి, సదా ప్రయోగీ పిల్లలకు బాప్‌దాదా యాద్‌ప్యార్‌ ఔర్‌ నమస్తే.
వరదానము:-
పాత సంస్కారాల నుండి, విఘ్నాల నుండి ముక్తిని ప్రాప్తి చేసుకునే సదా శక్తి సంపన్న భవ.  
ఏ విధమైన విఘ్నాల నుండి గానీ, బలహీనతల నుండి గానీ, పాత సంస్కారాల నుండి గానీ ముక్తులుగా అవ్వాలంటే శక్తులను ధారణ చేయండి అనగా అలంకార రూపులై ఉండండి. ఎవరైతే సదా అలంకారాలతో అలంకరింపబడి ఉంటారో, వారు భవిష్యత్తులో విష్ణు వంశీయులుగా అవుతారు. అయితే ఇప్పుడు వైష్ణవులుగా అవుతారు. వారిని ఎలాంటి తమోగుణీ సంకల్పాలు లేక సంస్కారాలు టచ్‌ చేయలేవు (స్పర్శించలేవు). వారు పాత ప్రపంచము, పాత ప్రపంచంలోని వస్తువులు, వ్యక్తుల నుండి సహజంగా దూరంగా ఉంటారు. వారిని ఏ కారణంతోనూ, ఎవ్వరూ టచ్‌ చేయలేరు.
స్లోగన్‌:-
ప్రతీ సమయంలో, ప్రతీ కర్మలో బ్యాలన్స్‌ ఉంచుకొనుటే, అందరి నుండి ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకునే సాధనం.  






I like to invite you on our YouTube Channel