03-12-2016 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్‌దాదా” మధువనము
‘‘మధురమైన పిల్లలూ - ఉన్నత పదవి పొందేందుకు ఆధారము చదువు మరియు స్మృతియాత్ర. అందువలన ఎంత చేయాలనుకుంటే అంత గ్యాలప్ చేయండి.’’
ప్రశ్న:-ఏ రహస్యాన్ని మొట్టమొదట తెలియజేయరాదు, ఎందుకు ?
జవాబు:-డ్రామాలోని గూఢ రహస్యము. దీనిని మొట్టమొదటనే తెలుపరాదు. ఎందుకనగా చాలామంది తికమకపడ్తారు. డ్రామాలో ఉంటే దానంతకదే రాజ్యము లభిస్తుందని, మా అంతకు మేమే పురుషార్థము చేస్తామని అంటారు. జ్ఞాన రహస్యాన్ని పూర్తిగా అర్థము చేసుకోకుండా వారి మతము ప్రకారము నడుచుకుంటారు. పురుషార్థము చేసుకుంటే నీరు కూడా లభించదని అర్థము చేసుకోరు.
గీతము:-భోలానాథునికి సాటి అయినవారు,................ (భోలేనాథ్ సే నిరాలా,..........)
ఓంశాంతి.మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు గుడ్‌మార్నింగ్. బాబా ఎంత ఉత్సాహముతో పిల్లలకు గుడ్‌మార్నింగ్ చెప్తారు. కానీ పిల్లలు బదులు చెప్పలేదు. పిల్లలు నా కంటే బిగ్గరగా చెప్పాలి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు గుడ్‌మార్నింగ్ చెప్తారు. ‘‘మేము ఈ శరీరము ద్వారా ఆత్మిక తండ్రికి గుడ్‌మార్నింగ్ చెప్తామని పిల్లలకు కూడా తెలుసు. కావున పిల్లలు ‘‘వాహ్ బాబా’’ అని అంత ఉత్సాహంగా చెప్పాలి కదా! చివరికి ఆ రోజు ఇప్పుడు వచ్చింది. ఎవరిని ప్రపంచమంతా పిలుస్తూ ఉందో, ఆ తండ్రి సన్ముఖంలో మనకు గుడ్‌మార్నింగ్ చెప్తున్నారు. మరలా సతోప్రధానంగా అయినప్పుడు పతితపావనుని స్మృతి చేయరు. ఇప్పుడు తమోప్రధానంగా ఉన్నారు. అందుకే ఓ పతితపావనా! రండి వచ్చి మమ్ములను పావనముగా చేయండి అని అందరూ స్మృతి చేస్తారు. పతితపావనులైన తండ్రే రావలసి వస్తుందని ఇప్పుడు మీకు తెలుసు. వారే సుప్రీమ్ పాదర్, గాడ్‌ఫాదర్. ఏసుక్రీస్తును సుప్రీమ్ ఫాదర్ అని అనరు. ఏసుక్రీస్తును దేవుని కుమారుడు అని అంటారు. అందరికంటే సుప్రీమ్ వారు ఒక్కరు మాత్రమే. ఆ గాడ్‌ఫాదరే ఈ సందేశకులను పంపుతారని కూడా భావిస్తారు. పతితులను పావనంగా చేసేందుకు సుప్రీమ్ ఫాదరే రావాలి. వారు నిరాకారులు. బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారని కూడా అంటారు. బ్రహ్మ, విష్ణువులకు పరస్పరము ఏ సంబంధముందో వారికి తెలియదు. నిరాకారునికి నోరు తప్పక కావాలి. అందువలన ఇతనిని భగీరథుడని కూడా అంటారు. నోటి ద్వారానే అర్థము చేయిస్తారు కదా. బాబా ఆదేశమిస్తున్నారు - మన్మనాభవ. ఇది కూడా నోటి ద్వారానే చెప్తారు కదా. ఇందులో ప్రేరణ అనే మాటే లేదు. తండ్రి బ్రహ్మ ద్వారా కూర్చుని అన్ని వేదశాస్త్రాల సారమును అర్థము చేయిస్తారు. ప్రతి దాని నుండి సారమును తీస్తారు కదా. మీరు తల్లి-తండ్రి, మేము మీ బాలకులము,........ అని పాడ్తారు కదా. కావున వారే ఇతనిలో ప్రవేశించి మీకు జ్ఞానమునిస్తారు. ఇవి ఎంతో అర్థము చేసుకోవలసిన విషయాలు. ప్రజాపిత బ్రహ్మను కూడా పిత అని అంటారు. అయితే మాత ఎక్కడ? తండ్రి కూర్చుని అర్థము చేయిస్తున్నారు - ఇతను ప్రజాపితనే కాక మాత కూడా ఇతనే. నేను సర్వాత్మలకు తండ్రిని. నన్నే గాడ్‌ఫాదర్ అని అంటారు. భారతవాసులు మీరే తల్లి-తండ్రి,......... అని పిలుస్తారు కానీ కొద్దిగా కూడా అర్థము తెలియదు. నిరాకారుడిని తల్లి అని ఎలా అనగలరు? వారు ఇతనిలో ప్రవేశించి దత్తత తీసుకుంటారు. కనుక ఈ బ్రహ్మ మాతగా అవుతాడు. ఇతని ద్వారానే దైవీసృష్టిని రచిస్తారు. ఇతడు కూడా దత్తు చేసుకున్న తల్లి, అతను తండ్రి ఇతనిని మరలా నందిగణము అని అంటారు. శివుని ముందు నందిని కూడా చూపిస్తారు. ఆవును ఎప్పుడూ చూపరు. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. ఎవరైనా కొత్తవారు వస్తే విస్తారంగా వినిపించాల్సి వస్తుంది లేకుంటే ఈ విషయాలు వారు అర్థము చేసుకోలేరు. కొంతమంది కుశాగ్రబుద్ధి గలవారుగా ఉంటే వారు వెంటనే అర్థము చేసుకుంటారు. 30 సంవత్సరముల వారి కంటే ఒక మాసము వారు తీవ్రముగా ముందుకు వెళ్తారు. అందువలన మేము చాలా ఆలస్యముగా వచ్చామని భావించరాదు. తండ్రి అంటున్నారు - పిల్లలూ, పురుషార్థము చేయండి. కాలేజికి వచ్చువారు చదువుకొని గ్యాలప్ చేసినట్లు ఇచ్చట కూడా చేయాలి. ఆధారమంతా చదువు మరియు స్మృతి పై ఉంది. మూలవతనములో ఆత్మలు సతోప్రధానంగా ఉంటాయని పిల్లలకు తెలుసు. తమోప్రధాన ఆత్మలు అచ్చటకు పోలేవు. మళ్ళీ పాత్రధారులందరూ తమ-తమ పాత్ర అనుసారము స్టేజి పైకి వస్తారు. డ్రామానే ఇలా రచింపబడి ఉంది. హద్దు డ్రామాలో అయితే 50-60 మంది పాత్రధారులుంటారు. కానీ ఇచ్చట ఇది చాలా బేహద్ డ్రామా. బాబా మన బుద్ధికి వేసిన తాళము తెరిచేశారు. కావున ఇప్పుడు ఈ లక్షీనారాయణులు విశ్వానికి యజమానులుగా, ఎంతో ధనవంతులుగా ఉండేవారని తెలుసుకున్నారు. అర్ధకల్పము విశ్వానికి యజమానులుగా ఉండినారు. దానిని అద్వైత రాజ్యమని అంటారు. అచ్చట ఒకే ధర్మముండేది. అది రామరాజ్యము, ఇది రావణరాజ్యము, రామరాజ్యములో వికారాలుండవు. వాస్తవానికి దీనిని ఈశ్వరీయ రాజ్యము అని అంటారు. ఈశ్వరుని రాముడని అనరు. చాలామంది రామ-రామ అని మాలను జపిస్తూ ఉంటారు కానీ భగవంతుడినే స్మృతి చేస్తూ ఉంటారు. రాముడనే పేరు రైటు, ఎందుకనగా ఈశ్వరుని నామ-రూపములేవో ఎవ్వరికీ తెలియదు. మనుష్యులు చాలా అయోమయములో ఉన్నారు. రావణుడెవరో ఎవ్వరికీ తెలియదు. రావణుని తగులబెట్టేందుకు చాలా ఖర్చు చేస్తారు. ఇంతకుముందు దశరా పండుగను చూపించేందుకు బయటివారిని(విదేశీయులను) కూడా పిలిచేవారు. సైన్స్ తీవ్రత కూడా ఎంత ఉందో చూడండి. ఈ సైన్సు సుఖమునే కాక దు:ఖమును కూడా ఇస్తుంది. సుఖము అల్పకాలమునకు మాత్రమే లభిస్తుంది. ఈ సైన్సు ద్వారానే ప్రపంచము వినాశనమౌతుంది. కాబట్టి ఇది దు:ఖము కదా. మీది సైలెన్స్ శక్తి. వారిది సైన్స్ శక్తి. మీరు సైలెన్స్‌గా మీ స్వధర్మములో ఉంటే పవిత్రముగా అవుతారు. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమౌతాయి. మీరు యోగబలముతో రాజ్యపదవిని తీసుకుంటారు. ఇందులో యుద్ధము మొదలైన మాటలేవీ లేవు. మీరు బాబా నుండి రాజ్య వారసత్వమును పొందుతారు. బాహుబలము విషయము వేరుగా ఉంటుంది. కల్ప-కల్పము పిల్లలైన మీరే పతితుల నుండి పావనంగా అవుతారు. మరలా పావనుల నుండి పతితులుగా అవుతారు. ఇది గెలుపు-ఓటముల డ్రామా. కానీ ఈ విషయాలు అందరి బుద్ధిలో కూర్చోవు. అందరూ సత్యయుగములోకి రారు. అనంతమైన తండ్రి తన పిల్లలకు మాత్రమే అర్థము చేయిస్తున్నారు. ఇతర ధర్మముల వారు తర్వాత వస్తారు. ఇది పాత ప్రపంచము. దేవీ దేవతా ధర్మము యొక్క పునాది శిథిలమైపోయింది. అలాగని ఫౌండేషన్ లేదని అనరాదు. ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు లేదు. పూర్తిగా మాయమైపోయింది. ఇప్పుడు అనేక ధర్మములున్నాయి. దీనిని రావణరాజ్యమని అంటారు. విష్ణు నాభి నుండి బ్రహ్మ వచ్చాడని అంటారు. ఈ చిత్రము యొక్క అర్థము చెప్పమని ఎవరినైనా అడగండి. ఎవ్వరూ తెలుపలేరు. ఆత్మ ఇరువురిది ఒక్కటే. వారిని విష్ణువు అని అంటారు. విష్ణుపురమును కూడా చూపిస్తారు. ఇది సంగమ యుగము. బ్రహ్మపురము, ప్రజాపిత బ్రహ్మ తప్పక ఉండాలి. బ్రాహ్మణులు అత్యంత ఉన్నతులు, శిఖరము(శిఖ). ఈ విరాట రూప చిత్రము కూడా ముఖ్యంగా భారతవాసులదే. భారతదేశములో మరలా చాలా ధర్మాలవారుంటారు. అందువలన దీనిని వెరైటీ ధర్మముల వృక్షమని కూడా అంటారు. ఇది మానవ సృష్టి వృక్షము కానీ ఇందులో వెరైటీ ధర్మాలున్నాయి. మొదట దైవీ ధర్మము. తర్వాత ఇస్లామ్,.......... ఇది బ్రాహ్మణ ధర్మము. ఈ సంగమ యుగము గురించి ఎవ్వరికీ తెలియదు. ఇది పురుషోత్తమ సంగమ యుగము, పురుషోత్తమ బ్రాహ్మణ ధర్మము. ఈ సమయములో సమాజ సేవ చేస్తారు. పిల్లలైన మిమ్ములను ఆత్మిక సమాజ సేవకులు అని అంటారు. సమాజ సేవకులు భారతదేశములో చాలా మంది ఉన్నారు. వారికి కూడా నమ్రతా భావముతో సేవ చేయుట నేర్పుతారు. కాంగ్రెసులో పక్కాగా ఉండినవారు కసువు కూడా ఊడ్చేవారు. పాకీ వారి పని కూడా చేసేవారు. మొదట పక్కాగా ఉండేవారు. వారు పింగాణి పాత్రలలో భుజించేవారు కాదు. గతించినదంతా డ్రామా. అది మరలా పునరావృతమౌతుంది. ఈ విషయాలు అర్థము చేసుకోకుంటే అయోమయములో పడిపోతారు. అందువలన డ్రామా రహస్యాన్ని ప్రారంభములో ఎవ్వరికీ అర్థము చేయించరాదు. డ్రామాలో నిశ్చయమై ఉంటే మాకు రాజ్యము దానంతకదే లభిస్తుంది. పురుషార్థము కూడా మా అంతట మేమే చేస్తామని అంటారు, ఇటువంటి మతమును అనుసరించేవారిగా కూడా అవుతారు. జ్ఞాన రహస్యాలను పూర్తిగా అర్థము చేసుకోరు. అరే! పురుషార్థము చేయకుంటే నీరు కూడా లభించదు. నీరు వచ్చి దానంతకదే మీ నోట్లో పడదు.
తండ్రి పతితులను పావనవనంగా చేసేందుకే వస్తారు. వారు వచ్చి సులభమైన దారిని చూపుతారు - ఆత్మను పావనంగా చేసుకునేందుకు నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమౌతాయి. పావనంగా చేసేందుకు నన్ను స్మృతి చేయండి అను శ్రీమతమును తండ్రి మాత్రమే ఇస్తారు. కానీ వారు నిరాకారులు. కావున తప్పకుండా సాకారములోకి వచ్చి శ్రీమతమును ఇస్తారు. తండ్రి అంటున్నారు - ఈ శరీరము నాకు నిశ్చయమై ఉంది. ఇది మార్పు చెందదు. ఇది కూడా రచింపబడి ఉంది. పరమపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపన చేయిస్తారనే మహిమ కూడా ఉంది. ఇది భగవానువాచ కదా. కనుక నేను మాట్లాడేందుకు నోరు కావాలి. ప్రేరణ ద్వారా ఏ చదువు చదువుకోరు. తండ్రి వచ్చి ఇతని ద్వారా డైరెక్షన్ ఇస్తారు. ఈ చిత్రాలు మొదలైనవి ఈ బ్రహ్మ తయారు చేయలేదు. ఇతను కూడా పురుషార్థియే కదా. ఇతను జ్ఞానసాగరుడు కాదు. ఇతను భక్తిమార్గములో ఉండేవారు. భక్తులను భగవంతుడే ఉద్ధరించాలి. వారు వచ్చి భక్తికి ఫలమును ఇస్తారు. పిల్లలైన మిమ్ములను మనుష్యుల నుండి దేవతలుగా చేస్తారు. తండ్రి ఇతనిలో ప్రవేశించి రాజయోగము నేర్పుతారు. వీరి పేరు శివబాబా. వారంటున్నారు - నాది దివ్యమైన అలౌకిక జన్మ. ఒక్క సంగమ యుగములో మాత్రమే నాకు ఇచ్చటకు వచ్చే పాత్ర ఉంది. అంతేకానీ మీరు పిలిచినందున నేను వస్తానని కాదు. నేను వచ్చే సమయములో ఒక్క సెకండు కూడా హెచ్చు తక్కువలు లేకుండా వస్తాను. ఖచ్చితమైన సమయానికి వస్తాను. మీరు పిలిస్తే వినడానికి నాకు అవయవాలు ఎక్కడున్నాయి? ఇది తయారైన డ్రామా. సమయము వచ్చినప్పుడు నేను వచ్చి పతితులను పావనంగా చేస్తాను. అంతేకానీ మీ పిలుపులు, అరుపులు భగవంతుడు వింటారని కాదు. చాలామంది పిల్లలు బాబాకు చెప్తారు - బాబా మీరు సర్వజ్ఞులు, నేను పరీక్ష పాసౌతానో లేదో తెలపండి. ఈ పని జరుగుతుందా? అని అడుగుతారు. బాబా అంటున్నారు - అరే, పతితులను పావనముగా చేసేందుకు, చేసే దారి చూపేందుకు మాత్రమే నేను వస్తాను. నా పాత్ర ఏదో అది మాత్రమే చేస్తాను. నేను ఏది వినిపించరాదో, అది వినిపించను. ఈ విషయములు తెలిపేందుకు నేను రాలేదు. నేను కూడా డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నాను. ప్రతి ఒక్కరి పాత్ర డ్రామాలో నిశ్చయమై ఉంది. ఎవరికి నిశ్చయబుద్ధి లేదో వారు స్వర్గములోకి వచ్చేందుకు అర్హులు కాదు. వారు మాటలు కూడా అలాగే మాట్లాడ్తారు. సూర్యవంశము, చంద్రవంశ కుటుంబములోని ఆత్మలు వచ్చి బాబా నుండి తప్పక వినాలి. తప్పక వారసత్వము తీసుకోవాలి. ఎక్కువ పురుషార్థము చేయనివారు కూడా స్వర్గములోకి అయితే తప్పక వస్తారు. కానీ శిక్షలను అనుభవించి ఏదో ఒక చిన్న పదవి పొందుతారు. బాబా, మేము సూర్య వంశీయులుగా అవుతాము, నారాయణునిగా అవుతామని చాలా మాటలు చెప్తారు. కానీ పిల్లలు అంత పురుషార్థము కూడా చేయాలి. బాబాను ఫాలో అయ్యే శక్తి కూడా ఉండాలి. ఫాలోఫాదర్ అనగానే వీరు ఎలా సరెండర్ అయ్యారో చూడండి. సర్వమూ ఈశ్వరునికి అర్పణ చేసేశారు. సర్వము ఈశ్వరార్థము ఇచ్చేసి మమకారాన్ని తొలగించుకోవాలి. మొదట భట్టీలో చాలా మంది వచ్చారు. ఇప్పుడు అలాంటి భట్టీ జరగదు. ఈ కార్యములో మాతలు, కన్యలు ముందుకు వెళ్తారు. అందులోనూ కన్యలు ఇంకా తీవ్రముగా ముందుకు పోతారు. దేహము, దేహ సంబంధాలను మర్చిపోవాలి. ఎందుకనగా ఇప్పుడు ఇంటికి వెళ్లాలి. ఇప్పుడు తండ్రి అంటున్నారు - నన్ను స్మృతి చేయండి. ఇప్పుడు నాటకము పూర్తి అవుతుంది. చాలా కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. ప్రేయసి - ప్రియుల వలె స్మృతి చేయాలి. ఈ బాబా ప్రియుడు, ప్రేయసి కాదు. తండ్రి అంటున్నారు - మీరు పతితమైపోయారు కనుక స్మృతి కూడా మీరే చేయాలి. మిమ్ములను స్మృతి చేయుటకు నేను పతితముగా లేను. నేను యుక్తి చెప్తాను దాని అనుసారము నడచుకోండి. ఈ ప్రపంచము పై మమకారాన్ని తొలగిస్తూ పోండి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్లాలి. ఈ జ్ఞానము బుద్ధిలో ఉంది. ఈ శరీరము కూడా పాతదైపోయింది. సత్యయుగములో నిరోగీ శరీరము లభిస్తుంది మరలా మనము పవిత్రంగా, సుందరంగా అవుతాము. పతితుల నుండి పావనముగా ఎలా అవుతారో కూడా మీకు తెలుసు. రాముడిని కూడా నల్లగా చేశారు. శివలింగాన్ని కూడా నల్లగా చేశారు. వారు ఎప్పుడూ నల్లగా(అపవిత్రముగా) అవ్వరు. వారు సదా పవిత్రముగా ఉంటారు వారిని తెల్లగా(పవిత్రంగా) తయారు చేయాలి. బాబా అంటున్నారు - చూస్తూనే ఆకర్షించే చిత్రాలు తయారు చేయండి. వార్తాపత్రికలలో ఎన్నో చిత్రాలు వేస్తూ ఉంటారు. మీ చిత్రాలు వేయరు. బాబా పిల్లలైన మిమ్ములను తెలివిహీనుల నుండి వివేకవంతులుగా తయారుచేస్తారు. ఈ లక్షీనారాయణులను వివేకవంతులుగా ఎవరు తయారుచేశారు? యోగము ద్వారా తండ్రి ఈ విధంగా తయారు చేశారు. పిల్లలైన మీకు లభించిన ఈ జ్ఞానాన్ని వ్యాపింపజేయాలి. విచార సాగర మథనము చేయాలి. ప్రభుత్వము వారు ప్రజల కొరకు ఎంత ఖర్చు చేస్తారు! ఇచ్చట పిల్లలైన మీదంతా తండ్రిది. తండ్రిదంతా పిల్లలైన మీది. తండ్రి అంటున్నారు - నేను నిష్కామ సేవాధారిని. నేను దాతను. నేను శివబాబాకు ఇస్తున్నానని అనుకోకండి. శివబాబా 21 జన్మలకు విశ్వమంతటికి యజమానులుగా చేస్తారు. ఈ తండ్రి తీసుకునేవారు కాదు, ఇచ్చేవారు. బాబా దాత. అచ్ఛా!
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్, ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-1. బ్రహ్మాబాబా ఎలాగైతే సమర్పణ అయ్యారో, అలా తండ్రిని అనుసరించాలి. తమ సర్వస్వాన్ని ఈశ్వరార్థము అర్పణ చేసి ట్రస్టీగా ఉంటూ మమకారమును పూర్తిగా తొలగించి వేయాలి.2. లాస్ట్‌లో వచ్చినా ఫస్ట్‌లో వచ్చేందుకు స్మృతి, చదువుల పై పూర్తిగా గమనముంచాలి.
వరదానము:-మాస్టర్ త్రికాలదర్శులుగా తయారై ప్రతి కర్మను యుక్తి యుక్తముగా చేసే కర్మ బంధన ముక్త్ భవ.ఏ సంకల్పము, మాట లేక కర్మ చేసినా, మాస్టర్ త్రికాలదర్శులుగా తయారై చేయండి. అలా చేస్తే ఏ కర్మ కూడా వ్యర్థముగా లేక అనర్థముగా జరగదు. త్రికాలదర్శులు అనగా సాక్షి స్థితిలో స్థితమై కర్మల గుహ్య గతిని తెలుసుకొని ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించేవారు. అలా చేస్తే ఎప్పుడూ కర్మ బంధనములో బంధింపబడరు. ఏ కర్మ చేస్తున్నా కర్మబంధన ముక్తులుగా ఉండి కర్మాతీత స్థితిని అనుభవం చేస్తూ ఉంటారు.
స్లోగన్:-ఎవరైతే హద్దు కోరికలంటే తెలియనివారిగా ఉంటారో, వారే గొప్ప సంపన్నవంతులు.
*** Om Shanti ***
I like to invite you on our YouTube Channel
 
