గీతము:-
మీరు నిదురించి రాత్రిని పోగొట్టుకున్నారు,...........(తూనే రాత్ గవాయి సో కే,................)
ఓంశాంతి.
తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. 5 వేల సంవత్సరాల క్రితము ఎలా అర్థం చేయించారో, మరలా ఇప్పుడు కూడా అదే విధంగా పాత ప్రపంచ వినాశనము, నూతన ప్రపంచమైన సత్యయుగ స్థాపన ఎలా జరుగుతుందో అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడిది పాత, కొత్త ప్రపంచాల సంగమ యుగము. తండ్రి తెలియజేస్తున్నారు - నూతన ప్రపంచమైన సత్యయుగము నుండి ఇప్పుడు కలియుగ అంత్యము వరకు ఏమేమి జరుగుతున్నాయో, ఏమేమి సామగ్రి ఉందో, ఏమేమి చూస్తారో, యజ్ఞము, తపము, దానము, పుణ్యము మొదలైనవి ఏమేమి చేస్తారో, ఇప్పుడు ఏమేమి కనిపిస్తూ ఉన్నాయో అవేవీ ఉండవు. పాత వస్తువేదీ ఉండదు. ఉదాహరణానికి పాత ఇల్లు పడగొడితే, అందులో ఉన్న మార్బల్ రాళ్లు మొదలైన మంచి వస్తువులను అలాగే ఉంచుకుంటారు. మిగిలిన వాటన్నింటినీ పగలగొడ్తారు. ఈ పాతదంతా సమాప్తమవుతుందని పిల్లలైన మీకు తెలుసు. పోతే ఈ సైన్సు నిపుణత(నైపుణ్యము) ఏదైతే ఉందో అది స్థిరంగా ఉంటుంది. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉందో, సత్యయుగము నుండి కలియుగ అంత్యము వరకు ఏమేమి జరుగుతాయో మీకందరికీ తెలుసు. ఈ సైన్సు కూడా ఒక చదువు. దాని నుండి విమానాలు, కరెంటు మొదలైనవన్నీ తయారయ్యాయి. ఇంతకుముందు ఇవి లేవు, ఇప్పుడు తయారయ్యాయి. ప్రపంచమైతే నడుస్తూనే ఉంటుంది. భారతదేశము అవినాశి ఖండము. ప్రళయమైతే జరగదు. ఇంత సుఖమునిచ్చే ఆ నైపుణ్యము అక్కడ కూడా ఉంటుంది. నేర్చుకున్నదంతా మరుసటి జన్మలో కూడా ఉపయోగపడ్తుంది. ఎంతో కొంత వెంట వస్తుంది. ఇచ్చట కూడా భూకంపము జరిగితే వెంటనే మరలా అన్నీ కొత్తవి తయారు చేస్తారు. అక్కడ నూతన ప్రపంచములో విమానాలు మొదలైనవి తయారుచేయువారు కూడా ఉంటారు. సృష్టి అయితే నడుస్తూనే ఉంటుంది. ఇవి తయారు చేయువారు మరలా వస్తారు. అంతమతి సో గతి అవుతుంది. భలే వారిలో ఈ జ్ఞానముండదు, కానీ వారు తప్పక వచ్చి కొత్త-కొత్త వస్తువులు తయారుచేస్తారు. ఇప్పుడు మీ బుద్ధిలో ఈ విచారాలున్నాయి. ఇవన్నీ సమాప్తమైపోతాయి. కేవలం భారత ఖండము మాత్రమే ఉంటుంది. మీరు సైనికులు. మీ యోగబలముతో మీ కొరకు స్వరాజ్య స్థాపన చేస్తూ ఉన్నారు. అచ్చట అన్నీ కొత్తగా ఉంటాయి. తమోప్రధానముగా ఉన్న తత్వాలు కూడా అచ్చట సతోప్రధానంగా అవుతాయి. మీరు కూడా నూతన పవిత్ర ప్రపంచములోకి వెళ్లేందుకు ఇప్పుడు పవిత్రముగా అవుతున్నారు. ఇది నేర్చుకొని మేము వివేకవంతులుగా అవుతామని, చాలా సుందరమైన పుష్పాలుగా తయారవుతామని మీకిప్పుడు తెలుసు. ఎవరికైనా మీరు ఈ మాటలను వినిపిస్తే, వారు చాలా సంతోషిస్తారు. ఎవరు ఎంత బాగా అర్థం చేయిస్తారో, వారిని చూచి అంత ఎక్కువగా సంతోషిస్తారు. మీరు చాలా బాగా తెలియజేస్తారని అంటారు కానీ అభిప్రాయము వ్రాయమంటే ఆలోచిస్తామని అంటారు. ఇంతలోనే నేను ఎలా వ్రాయాలని అంటారు. ఒకసారి వింటూనే తండ్రితో యోగము ఎలా జోడించాలో నేర్చుకోలేము, చాలా బాగుందని అంటారు. ఇప్పుడీ పాత ప్రపంచము వినాశనము కానున్నదని మీరు తప్పక తెలుపుతూ ఉంటారు. తల పై పాప భారము చాలా ఉంది. ఇది పతిత ప్రపంచము. చాలా పాపాలు చేశారు. రావణ రాజ్యములో అందరూ పతితులే. అందుకే పతితపావనులైన తండ్రిని పిలుస్తారు. మీరిప్పుడు ఈ జ్ఞానము తెలుసుకున్నారు. సత్యయుగము తర్వాత త్రేతా యుగము వస్తుందని సత్యయుగంలో ఎవ్వరికీ తెలియదు. అక్కడ ప్రాలబ్ధమును అనుభవిస్తారు.
ఇప్పుడు పిల్లలైన మీరు చాలా బుద్ధివంతులుగా తయారౌతారు. మనలను ఆత్మిక తండ్రి చదివిస్తున్నారని మీకు తెలుసు. బాబా సర్వశక్తివంతులు. వారు(సన్యాసులు) శాస్త్రాల అథారిటీ. ఆ శాస్త్రాలను చదివేవారిని సర్వశక్తివంతులని అనరు. ఇవన్నీ భక్తిమార్గములోని శాస్త్రాలు. బాబా చదివించే ఈ చదువు నూతన ప్రపంచము కొరకు నూతన విషయాలు. కావున పిల్లలైన మీకు చాలా సంతోషముండాలి. బుద్ధిలో రోజంతా ఈ జ్ఞానము మెదులుతూ ఉండాలి. విద్యార్థులు ఏమి చదువుతారో దానిని మరలా రివైజ్ కూడా చేస్తారు. దానినే విచార సాగర మథనమని కూడా అంటారు. బాబా మనకు అనంతమైన చదువు అనగా సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యమంతా కూర్చుని అర్థం చేయిస్తున్నారని మీరు తెలుసుకున్నారు. అది మీరు తప్ప ఇతరులెవ్వరూ అర్థము చేసుకోలేరు. కావున మీకు చాలా సంతోషముండాలి. మీరు చాలా గొప్ప మనుష్యులు. మిమ్ములను చదివించేవారు కూడా అత్యంత ఉన్నతమైన తండ్రి. కాబట్టి మీకు సదా సంతోషపు మీటరు పెరిగి ఉండాలి. సదా బుద్ధిలో ఈ విషయాలు రివైజ్ చేసుకుంటూ ఉండండి - ‘‘మొట్టమొదట మేము పవిత్రముగా ఉండేవారము, 84 జన్మలు తీసుకుని పతితులుగా అయ్యాము, ఇప్పుడు డ్రామా ప్లాను అనుసారము బాబా మమ్ములను మళ్లీ పావనంగా చేస్తున్నారు. సాధు సత్పురుషులందరూ మాకు రచయిత అయిన తండ్రి, వారి రచనల ఆదిమధ్యాంతాలు తెలియవని అంటారు. ఏసుక్రీస్తు మరలా తన సమయానికి వస్తారని మీకు తెలుసు. ఈ మొత్తము ప్రపంచము పై క్రైస్తవుల రాజ్యమున్నట్లు ఉండేది. ఇప్పుడు అందరూ వేరు వేరుగా అయిపోయి పరస్పరము కొట్లాడుకుంటున్నారు. ఒకే రాజ్యము, ఒకే బాష ఉండాలని అంటున్నారు. మత భేదాలు ఉండరాదని అంటారు. కానీ ఇది ఎలా జరుగుతుంది? ఇప్పుడు పరస్పరము కొట్లాడుకొని ఇంకా పక్కా అయిపోయారు. ఇప్పుడు అందరిదీ ఒకే దేవతా మతము అయ్యేందుకు వీలు లేదు. భలే రామరాజ్యము కావాలని అంటారు కానీ కొంచెము కూడా అర్థము చేసుకోరు. ఇంతకుముందు మీకు కూడా ఏమీ తెలియదు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. మన యుగమే వేరే అని ఇప్పుడు మీకు తెలుసు. ఈ సంగమ యుగములో బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణ ధర్మము స్థాపనౌతుంది. బ్రాహ్మణులైన మీరు రాజఋషులు. మీరు పవిత్రముగా కూడా ఉన్నారు. శివబాబా నుండి రాజ్యము ప్రాప్తి చేసుకుంటారు. వారు బ్రహ్మతత్వముతో యోగము జోడిస్తారు, ఒక్క తండ్రితో యోగముండదు. కొంతమంది ఒకరితో, మరి కొంతమంది మరొకరితో యోగము ఉంచుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరిని పూజిస్తారు. అత్యంత ఉన్నతమైనవారు ఎవరో వారికి తెలియనే తెలియదు. అందువలన తండ్రి అంటున్నారు - ఇదంతా ఆసురీ సంప్రదాయము, తుచ్ఛబుద్ధి, రావణుని బానిసలు. మీరిప్పుడు శివబాబావారిగా అయ్యారు. మీకు తండ్రి నుండి నూతన ప్రపంచము అనగా సత్యయుగ వారసత్వము లభిస్తుంది. తండ్రి అంటున్నారు - ఓ ఆత్మలారా, మీరిప్పుడు తమోప్రధానము నుండి తప్పక సతోప్రధానంగా అవ్వాలి. అందుకు కేవలం నన్ను స్మృతి చేయండి. ఇది ఎంతో సులభమైన విషయము. గీతలో కృష్ణుని పేరు వేసేశారు, వారిని ద్వాపర యుగములోకి తీసుకెళ్లారు. చాలా పెద్ద తప్పు చేశారు కానీ ఈ విషయాలు ఎవరి బుద్ధిలో కూర్చుంటాయో వారు స్థిరంగా ఇచ్చటకు వస్తూ ఉంటారు. మేళాకైతే చాలా మంది వస్తారు. వారి నుండి నాటు ఎలా ఏర్పడుతుందో చూడండి. అనేక ధర్మముల వారు వస్తారు, అందులో కూడా ఎక్కువగా హిందూ ధర్మమువారు వస్తారు. వారు దేవీదేవతల పూజారులుగా ఉంటారు. వారే పూజ్యులు, వారే పూజారులు. దీని అర్థము కూడా తెలిపించాల్సి వస్తుంది. మేళాలు, ప్రదర్శనీలలో ఎక్కువగా అర్థం చేయించలేము. కొంతమంది 4-5 మాసాలు వస్తారు. కొంతమంది మంచిరీతిగా అర్థము చేసుకుంటారు. మీరు ఎన్ని ఎక్కువ ప్రదర్శనీలు, మేళాలు ఎక్కువగా చేస్తారో, అంత ఎక్కువ మంది వస్తారు. ఈ జ్ఞానము చాలా బాగుంది, పోయి వినాలని భావిస్తారు. సెంటర్లో ఇన్ని చిత్రాలు ఉండవు. ప్రదర్శనీలో చాలా చిత్రాలుంటాయి. మీరు అర్థం చేయించినప్పుడు వారికి బాగుందని కూడా అనిపిస్తుంది, కాని బయటకు వెళ్తూనే అక్కడ మాయ వాయుమండలమున్నందున వారి వృత్తి, వ్యాపారాలలో లగ్నమౌతారు. ఇపుడీ పాత ప్రపంచము సమాప్తమై కొత్తది తయారౌతుంది. బాబా మన కొరకు స్వర్గ రాజ్యమును స్థాపన చేస్తున్నారు. నూతన ప్రపంచములో మనము వెళ్ళి కొత్త భవనాలు తయారు చేస్తాము. అంతేకాని భూమి నుండి మరలా భవనాలు బయటకు రావు. వీరు మన తండ్రి కూడా అయ్యారు, టీచరు కూడా అయ్యారని ఈ మొట్టమొదటి ముఖ్యమైన విషయము పై నిశ్చయముండాలి. వారు మనుష్య సృష్టికి బీజరూపులు, వారిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. కనుక వారిని జ్ఞానసాగరులు,.................. అని మహిమ చేస్తారు. ఆ బీజము జడమైనది, అది మాట్లాడలేదు. ఇది చైతన్యమైనది. తండ్రి మీకు మొత్తం జ్ఞానమంతా ఇచ్చారు. దానిని మీరు ఇతరులకు చక్కగా అర్థం చేయించాలి. మేళాలు, ప్రదర్శనీలకు చాలా మంది వస్తారు. కోట్లలో ఎవరో కొందరు మాత్రమే వెలువడ్తారు. 7-8 రోజులు వచ్చి తర్వాత మాయమైపోతారు. ఆ విధంగా చేస్తూ చేస్తూ ఉంటే ఎవరో ఒకరు రానే వస్తారు. సమయము కొద్దిగా మాత్రమే ఉంది, వినాశనము సమీపముగా ఉంది. కర్మాతీత అవస్థను తప్పకుండా పొందుకోవాలి. పతితుల నుండి పావనముగా అయ్యేందుకు స్మృతి చాలా అవసరము. మిమ్ములను మీరు సంభాళించుకోవాలి. నేను సతోప్రధానంగా తయారవ్వాలనే చింత ఎప్పుడూ ఉండాలి ఎందుకనగా తల పై జన్మ-జన్మాంతరాల పాప భారము ఉంది. రావణ రాజ్యమైనందున మెట్లు దిగుతూనే వచ్చారు. ఇప్పుడు యోగబలముతో పైకి ఎక్కాలి. నేను సతోప్రధానంగా అవ్వాలని రాత్రింబవళ్ళు ఇదే చింత ఉండాలి, అంతేకాక సృష్టి చక్ర జ్ఞానము కూడా బుద్ధిలో ఉండాలి. పాఠశాలలో కూడా మేము ఫలానా ఫలానా సబ్జెక్టులు పాసవ్వాలని పాఠశాలలో కూడా ఉంటుంది. ఇందులో ముఖ్యమైన సబ్జెక్టు - ‘‘స్మృతి’’. సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము కూడా అవసరము. మీ బుద్ధిలో మెట్ల(సీఢీ) జ్ఞానమంతా ఉంది - ఇప్పుడు మేము బాబా స్మృతిలో సత్యయుగములో సూర్యవంశ కుటుంబపు మెట్లు ఎక్కుతాము. 84 జన్మలు తీసుకుంటూ మెట్లు దిగుతూ వచ్చాము, ఇప్పుడు వెంటనే పైకి ఎక్కాలి. సెకండులో జీవనముక్తి అనే గాయనముంది కదా. ఈ జన్మలోనే తండ్రి నుండి జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకొని మీరే దేవతలుగా అవుతారు. బాబా అంటున్నారు - పిల్లలూ, సూర్యవంశీయులుగా ఉన్న మీరే మళ్లీ చంద్రవంశీయులు, వైశ్యవంశీయులుగా అయ్యారు. ఇప్పుడు మిమ్ములను బ్రాహ్మణులుగా తయారు చేస్తాను. బ్రాహ్మణులు అత్యంత ఉన్నతమైనవారు(శిఖ). అత్యంత ఉన్నతమైన పరమపిత పరమాత్మ వచ్చి బ్రాహ్మణ, దేవత, క్షత్రియులు - ఈ మూడు ధర్మాలు స్థాపన చేస్తారు. ఇప్పుడు మనము బ్రాహ్మణ వర్ణములో ఉన్నామని, తర్వాత దేవతా వర్ణములోకి వస్తామని మీకు తెలుసు. పిల్లలకు ప్రతి రోజూ బుద్ధిలో ఎంతో జ్ఞానము నింపుతున్నారు, దానిని ధారణ చేయాలి లేకుంటే మీ సమానంగా ఎలా తయారు చేస్తారు. ఎవరు చక్కగా చదువుకొని చదివిస్తారో వారే సూర్యవంశములో వస్తారు, చాలా కొద్ది మందే వస్తారు.
ఈ సమయములో మీ విధానాలు, పద్ధతులు ప్రపంచానికి పూర్తి భిన్నముగా ఉన్నాయి. ఈశ్వరుని గతి-మతి భిన్నమైనదని అంటారు కదా. మీరు తప్ప తండ్రితో ఎవ్వరూ యోగము జోడించరు. ప్రదర్శనీలో వస్తారు మళ్లీ వెళ్లిపోతారు. అటువంటివారు ప్రజలుగా అయిపోతారు. ఎవరు బాగా చదివిస్తారో, వారు మంచి పదవి పొందగలరు. తర్వాత మీ మిషనరీ(సంస్థ) కూడా తీవ్రమౌతూపోతుంది. చాలా మందికి ఆకర్షణ కలుగుతుంది, వస్తూ ఉంటారు. నూతన విషయము వ్యాపించుటకు సమయము పడ్తుంది కదా. చిత్రాలు కూడా త్వరగా చాలా ఎక్కువగా తయారౌతాయి. రోజురోజుకు మనుష్యులు కూడా వృద్ధి చెందుతూ పోతారు.
ఈ బాంబుల యుద్ధము మొదలైనవి జరిగితే, ఎలా ఉంటుందో మీకు తెలుసు. రోజురోజుకు దు:ఖము అపారమౌతూ పోతుంది. చివరికి దు:ఖ ప్రపంచము సమాప్తమవుతుంది. కాని పూర్తిగా వినాశనము కాదు. శాస్త్రాలలో కూడా ఈ భారతదేశము అవినాశి ఖండము అనే గాయనముంది. మా స్మృతి చిహ్నాలు ఉన్నవి ఉన్నట్లుగా అబూలో ఉన్నాయని మీకు తెలుసు. వాటిని గురించి అర్థం చేయిస్తూ అవి జడ స్మృతి చిహ్నాలని తెలపాలి. ఇచ్చట ప్రాక్టికల్‌గా స్థాపనౌతూ ఉన్నారు. వైకుంఠము కొరకు రాజయోగము నేర్చుకుంటూ ఉన్నారు. దిల్‌వాలా మందిరము ఎంతో మంచి రీతిగా నిర్మించారు. మనము కూడా ఇచ్చట వచ్చి కూర్చున్నాము. అంతకు ముందే మన స్మృతి చిహ్నాలు తయారై ఉన్నాయి. మీరు స్వర్గ రాజ్య పదవి పొందేందుకు ఇక్కడ కూర్చుని ఉన్నారు. బాబా మేము మీ నుండి రాజ్యము తప్పక తీసుకుంటామని అంటారు. రోజంతా ఎవరైతే చక్కగా స్మృరణ చేస్తూ, చేయిస్తూ ఉంటారో వారికి సంతోషము కూడా ఉంటుంది. మేము పాస్ అవుతామా, లేదా? అని విద్యార్థులకు స్వయము తెలుసు. లక్షలు, కోట్లమందిలో స్కాలర్‌షిప్ చాలా కొద్ది మందికే లభిస్తుంది. ముఖ్యమైనవారు 8 మంది బంగారు, తర్వాత 108 మంది వెండి, తర్వాత 16 వేలమంది రాగి యుగము వారు. ఉదాహరణానికి పోప్ మెడల్స్ ఇచ్చునప్పుడు అందరికీ బంగారువే ఇవ్వరు. కొంతమందికి బంగారువి, కొంతమందికి వెండివి ఇస్తారు. మాల కూడా అదే విధంగా తయారౌతుంది. మీరు గోల్డెన్ బహుమతి తీసుకోవాలని అనుకుంటారు. వెండిది తీసుకుంటే చంద్రవంశములోకి వస్తారు. బాబా అంటున్నారు - నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమౌతాయి. ఇక ఏ ఇతర ఉపాయము లేదు. పాస్ కావాలనే చింత ఒక్కటే పెట్టుకోండి. యుద్ధము ఇక కొంత తీవ్రముగా జరిగి గొడవలు జరిగితే జోరుగా పురుషార్థము చేయుటలో లగ్నమౌతారు. పరీక్షల సమయములో విద్యార్థులు కూడా గ్యాలప్ చేసే పురుషార్థములో లగ్నమౌతారు. ఇది బేహద్ పాఠశాల, ప్రదర్శనీ పై బాగా ప్రాక్టీసు చేస్తూ ఉండండి. ప్రొజెక్టరు ద్వారా అంతగా ప్రభావితము కారు. ప్రదర్శనీ చూస్తే చాలా ఆశ్చర్యపడ్తారు. అచ్ఛా!
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్, ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పాత ప్రపంచము వినాశనము కాక ముందే మీరు కర్మాతీత అవస్థను తయారు చేసుకోవాలి. స్మృతిలో ఉండి మీరు సతోప్రధానంగా అవ్వాలి.
2. మమ్ములను చదివించేవారు స్వయము అత్యంత ఉన్నతులైన తండ్రి అను ఖుషీ సదా ఉండాలి. మంచి రీతిగా చదివి, చదివించాలి. విన్న తర్వాత విచార సాగర మథనము చేయాలి.